09-10-2025 01:40:19 AM
రాష్ట్ర అధ్యక్షుడికి నివేదిక అందజేసిన త్రిసభ్య కమిటీ
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలిసింది. అభ్యర్థి ఎంపికపై ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీ నియోజకవర్గంలోని పలువురి అభిప్రాయాలు.సేకరించి తుది నివేదికను బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు అందజేసింది.
రాంచందర్ రావు ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించి తుది నివేదికను జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ఆ తర్వాత జాతీయ నాయకత్వం పేరును ప్రకటించే అవకాశముం ది. దేశవ్యాప్తంగా పలు చోట్లు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వం అందరి పేర్లను ఒకేసారి ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసిం ది.
జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశిస్తు న్న వారిలో కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డి, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ, వీరపనేని పద్మ పేర్లు ముందు నుంచి వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. త్రిసభ్య కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎం పీ పోతుగంటి రాములు, సీనియర్ నేత, అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్న విషయం తెలిసిందే.