09-10-2025 12:45:01 AM
రాష్ట్రంలోని 6 జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఈ నెల 12న రాష్ర్టంలోని 6 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ర్టంలో పోలియో చివరి కేసు 2007లో, దేశంలో 2011లో నమోదయ్యింది. మూడేండ్లుగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా, ఇందులో మన రాష్ర్టం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలోనూ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ 6 జిల్లాల పరిధిలో ఐదేండ్లలోపు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.