09-10-2025 01:14:36 AM
అడ్లూరికి పొన్నం క్షమాపణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమక్షంలో మంత్రి అడ్లూరికి మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పడంతో పంచాయితీ సద్దుమ ణిగింది. జూబ్లీహిల్స్‌లో మైనార్టీ శాఖ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్‌కుమార్ ఆలస్యంగా రావడంతో.. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో పెద్ద దుమారంలేవడంతోపాటు మాదిగ సామాజికవర్గం నాయ కులు భగ్గుమన్న విషయం తెలిసిందే.
దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ ఆదేశాలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం తన నివాసంలో మంత్రులు అడ్లూరి, పొన్నంతో సమావేశమయ్యారు. పొన్నం చేసిన వ్యాఖ్యలను మరోసారి పరిశీలించి సయోధ్య కుదిర్చారు. ‘నేను మంత్రి లక్ష్మణ్‌కుమార్‌పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కావాలని కొందరు నాపై తప్పుడు ప్రచా రం చేశారు.
అయినా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటాను. లక్ష్మణ్ అంటే నాకు అభిమానం. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కలిసి ఉంటున్నాం’ అని మంత్రి పొన్నం తెలిపారు. అయితే తాను ఎలాం టి తప్పుడు మాటలు మాట్లాడలేదని మంత్రి పొన్నం దాటవేసే ప్రయత్నం చేయగా, పీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుని వీడియోలన్నీ బయటికి వచ్చిన విషయాన్ని వివరించారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నన్ను ఉద్దేశించి మాట్లాడినవే.
అయినా నాపై అను చిత వ్యాఖ్యలు చేయలేదనడం సరైంది కాదు. వీడియోలను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. చివరకు వాస్తవాన్ని గ్రహించిన పొన్నం ప్రభాకర్.. ‘కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి చాంపియన్. నేను పార్టీలో పుట్టి పెరిగాను. పార్టీ సంక్షేమమే తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధపడిన దాని కి నేను క్షమాపనణ కోరుతున్నాను.
నాకు అలాంటి ఆలోచన లేదు. నేను ఆ ఒరవడిలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు. కరీంనగర్‌లో మాదిగ సామాజికవర్గం, మేమం తా కలిసి పెరిగాం. ఎవరి కూడా ఎలాం టి అపోహ ఉండవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. సామాజిక న్యాయం కోసం పోరాడే సం దర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం’ అని వెల్లడించారు.
మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి: పీసీసీ చీఫ్
కాంగ్రెస్ అన్ని వర్గాలకు చెందిన పార్టీ. రాహుల్‌గాంధీ ఆశయాన్ని, ఆకాంక్షలను పార్టీ ముందుకు తీసుకెళ్లుతోంది. సహచర మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తు న్నా, ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహారించాలి’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ ఇద్దరూ కష్టపడి పైకి వచ్చారని, జరిగిన ఘటనపై పొన్నం చింతిస్తూ అడ్లూరికి క్షమాపణలు చెప్పారని తెలిపారు.
ఇక ఈ సమస్య ఇంతటి తో సమిసిపోవాలని యావత్ మాదిగ సామాజికవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్‌పై పొన్నం చేసిన అనుచిత వ్యాఖ్యలతో లక్ష్మణ్ ఇబ్బంది పడటమే కాకుండా యావత్ సమాజం కొంత బాధపడిందన్నారు. మంత్రుల మధ్య జరిగిన ఘటన తమ పార్టీ కుటుంబ సమస్య అని, ఇక మనస్ఫర్థలన్నింటిని వదిలి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహాయంతో కుల సర్వే పారదర్శకంగా నిర్వహించామని గుర్తుచేశారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్‌ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరావత్రి అనిల్, శివసేనారెడ్డి పాల్గొన్నారు.