09-10-2025 12:00:00 AM
గుడి బడి నివాస ప్రాంతాలనే తేడా లేకుండా నిర్వహణ
మద్యానికి బానిస అవుతున్న యువత
చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఇబ్బడి ముప్పడిగా బెల్ట్ షాపులు అవతరించి మద్యం ఏరులై పారుతుంది. పట్టణం, గ్రామాలలో గుడి, బడి ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు... రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనితో వయస్సుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిసలేవుతూ తమ బంగారు భవిష్యత్ ను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తూలుతూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పాల్వంచ మండలం లక్ష్మీ దేవి పల్లి గ్రామ పంచాయతీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే ఏర్పాటు చేసిన బెల్ట్ షాప్ లలో మద్యం ఏరులైపారుతోంది.
సంబంధిత ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమాలకు తావిస్తోంది. ఇప్పటి కైన ఎక్సైజ్ అధికారులు డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్నటువంటి బెల్టు షాపులను తొలగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.