calender_icon.png 8 October, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫిర్యాదు

08-10-2025 07:38:43 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇండోర్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బుధవారం ముస్లింల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, దేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం చాలా దారుణమని తెలిపారు. ఏ మతం కూడా ఇతర మతలను కించపరిచే విధంగా బోధించలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రహమాన్, మొయిన్, మిన్వర్ ఖాన్, శహబాజ్, శబాజ్ హైదర్, వాలి, జుబెర్ తదితరులు పాల్గొన్నారు.