08-10-2025 07:36:57 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇటీవల గుండెపోటుతో (బుద్ధ వాసి) మృతి చెందిన DSP విష్ణుమూర్తి ఆత్మకు శాంతి కలగాలని సెంట్రల్ కమిటీ, దీక్ష భూమి కమిటీ, జైభీం సేన కమిటీ, వర్ష వాస్ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం DSP పి.విష్ణుమూర్తి చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు. త్రీశరణ పంచాశీల్, బుద్ధ వందన చేసి, 2 నిముషాలు మౌనం పాటించారు.