23-08-2025 06:11:55 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు దుర్వినియోగంపై జాతీయ హుమెన్ రైట్స్ కమిషన్ ప్రతినిధులు జిల్లా విద్యాధికారికి శనివారం ఫిర్యాదు చేశారు. మహదేవపూర్ మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికుల వేతన బకాయిలు 2018వ సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు కార్మికుల వేతనాలు దుర్వినియోగం కావడం జరిగిందని, మండల వనరుల కేంద్రం పి.ఎఫ్.ఎం ఎస్, నుండి జమ చేసిన వివరాలు తెలియజేయాలని మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క జాబితా ఆ కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తున్న గౌరవ వేతనం నకలు కాపీలు ఇవ్వాలని, మండల వనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు వారి అర్హతలు తెలియజేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను దారి మళ్లించిన మండల వనరుల కేంద్రం ఇంచార్జ్ యొక్క వివరాలను అందజేయాలని, వెంటనే ఆర్డీవో స్థాయి అధికారిని నియమించి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ టి ఐ యాక్ట్ 2005, 6 (1) ప్రకారం నకలు కాపీలు ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్ సి ప్రతినిధులు జిల్లా విద్యాధికారి ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ ఇంచార్జ్ కొరిపెల్లి ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్, భూపాలపల్లి టౌన్ ఇంచార్జ్ నాంపల్లి కుమార్, మహదేవపూర్ మండల ఇన్చార్జి సుంకే మధుకర్, మండల అడ్వైజర్ కారేంగుల బాబురావు, మండల కౌన్సిల్ మెంబర్ గడ్డం రాజుతోపాటు సభ్యులు పాల్గొన్నారు.