calender_icon.png 29 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి

29-09-2025 07:08:47 PM

మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారులతో పుస్తక పూజలు..

దర్శించుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి..

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో అమ్మవారు సోమవారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి చతు షష్టి పూజలు, గోపూజ, కుంకుమార్చనలు, చిన్నారులతో సామూహిక పుస్తక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఎంసీ రాజమౌళి, గాడి పల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, బాలేష్, సుభాష్ చంద్రబోస్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాలువ శ్రీధర్ రావు, ప్రధాన అర్చకులు నంద బాల శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.