29-09-2025 06:33:16 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెద్ద కొడపగల్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కే.హన్మంత్ రెడ్డి అధ్యక్షులు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించబడింది. ఈ సభలో జమ ఖర్చుల ఆమోదం 2024 నుండి 2025 వరకు సంఘం యొక్క వార్షిక నివేదికను కార్యదర్శి ఖర్చులు ఆదాయాలు రుణాలు ఇతర ఆర్థిక విషయాలపై సభ్యుల ముందు చదివి వినిపించి ఆపై రిపోర్ట్ ఆమోదించబడిందని తెలిపారు.
యాసంగిలో కొనుగోలు చేసిన వరి ధాన్యం సన్న వడ్ల యొక్క బోనస్ ప్రభుత్వం నుండి తొందరగా విడుదల చేయుటకు తీర్మానించి ఆమోదించడం అయినది. సంఘానికి కావలసినంత యూరియా పంపుటకు తీర్మానించి ఆమోదించడం జరిగింది. నూతన సభ్యులకు 51 మందికి 2556000/- స్వల్ప కాలిక రుణాలను మంజూరు చేయబడిందని సమావేశం సంఘం సభ్యుల మధ్య విశ్వాసాన్ని సహకారాన్ని పెంపొందించి సహాయపడుతుందని పిఎసిఎస్ చైర్మన్ కే హనుమంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు బంతిలాల్, దస్తా రెడ్డి, హనుమయ్య, సంఘ సభ్యులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.