29-09-2025 06:05:13 PM
తాడ్వాయి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా తాడువాయి మండల కేంద్రానికి చెందిన అంకాలపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బిజెపి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని తెలిపారు. 1995 నుంచి 2006 వరకు సామాన్య కార్యకర్తగా కొనసాగానని తెలిపారు. 2006 నుంచి క్రియాశీల సభ్యునిగా బాధ్యతలు నిర్వహించానన్నారు. రెండు పర్యాయాలు మండల ప్రధాన కార్యదర్శిగా, రెండు పర్యాయాలు జిల్లా కార్యవర్గ సభ్యునిగా కొనసాగినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత చురుకుగా పనిచేసి పార్టీకి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.