6 July, 2026 | 3:10 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కారించాలి

02-12-2024 08:18 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్... 

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హజరై మాట్లాడారు. అంతకుముందు జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలు భూ సంబంధ రుణాలు రెండు పడకల గదుల ఇల్లు మంజూరు వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కారించాలని సూచించారు. అనంతరం బాల్య వివాహాల రైతు భారత్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, జడ్పీ సీఈవో చందర్‌నామక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.