calender_icon.png 24 November, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 30 ఫిర్యాదులు

11-02-2025 12:00:00 AM

జగిత్యాల, ఫిబ్రవరి10 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ బి. ఎస్. లత తో కలసి కలెక్టర్ స్వయంగా స్వీక రించారు.

మొత్తం 30 అర్జీలు అందినట్టు తెలిపారు.  కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ బి. ఎస్. లత ఆర్డీఓ లు మధు సుధన్, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంత రావు, వివిధ  జిల్లా అధికా రులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

ప్రజావాణికి 121 దరఖాస్తులు 

సిరిసిల్ల, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): ప్రజావాణికి 121 దరఖాస్తులు వచ్చినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ శాఖకు 50, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 12, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి ఆరు, వ్యవసాయ శాఖ, ఉపాధి కల్పనా శాఖలకు 5 చొప్పున, జిల్లా పంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో తంగళ్ళపల్లి, ముస్తాబాద్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి నాలుగు చొప్పున, జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి మూడు, వైద్య కళాశాల, డిఆర్డిఓ, మిషన్ భగీరథ, ఎంపీడీవో కోనరావుపేట, సెస్ కార్యాలయానికి రెండు చొప్పున, ఏడి మైన్స్, జిల్లా వైద్యాధికారి, డిపిఆర్‌ఈ, ఈవో రాజరాజేశ్వరాలయం వేములవాడ, నీటిపారుదల , జిల్లా ఎస్పీ కార్యాలయం, వేములవాడ మున్సిపల్ కార్యాలయం, ఎంపీడీవో గంభీరావుపేట, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట రిజిస్టర్ కార్యాలయానికి ఒకటి చొప్పున వచ్చినట్లు పేర్కొన్నారు.