10-02-2025 11:20:21 PM
చార్మినార్ (విజయక్రాంతి): పాతబస్తీ నాయక్ బుడోఖాన్ కరాటే విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఫోర్త్ ఇంటర్నెషనల్ కరాటే చాంఫియన్ షిప్ కరాటే పోటీల్లో గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో రాజన్నబావి తక్షాశిల ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. వీరిలో 11 మంది గోల్డ్ మోడల్ సాధించారు. మరో నలుగురు సీల్వర్ మోడల్స్ సాధించారు. ఓ విద్యార్థి బ్రౌస్ మోడల్ సాధించాడు. ఈ సందర్భంగా కటాస్, ఫైరింగ్ విభాగాలలో ప్రతిభను చాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు మోడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పీ.వి.ఎస్. ప్రసాద్ విద్యార్థులను అభినందించారు.