27-05-2025 12:00:00 AM
- సర్వేలో తేలిన జడ్చర్ల నల్లకుంట ఎఫ్టీఎల్
- ఉన్నతాధికారులకు నివేదిక అందజేసిన జిల్లాఅధికారులు
మహబూబ్ నగర్ మే 26 (విజయ క్రాంతి) : జడ్చర్ల రాజకీయ చతురత లో తీవ్ర చర్చనీయాంశమైన నల్లకుంట ప్రత్యేక చర్చ కు దారి తీసింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లకుంట చెరువు ఎఫ్టిఎల్ పరిధి మట్టి పోసి నీళ్లు రాకుండా, నిలువ కుండ చేశారని ఆరోపణలు బలంగా వినిపించాయి.
జడ్చర్ల పట్టణవాసులంతా ఈ నల్లకుంట చెరువు ఏమి జరిగిందని ప్రత్యేకంగా వెళ్లి చూసి వచ్చిన దాఖలాలు లేకపోలేదు. అంటే ఈ చెరువుపై జరిగిన ఎంత చర్చకు దారితీసిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దిశగానే నల్లకుంట చెరువు ఎఫ్టిఎల్ పరిధిని ఇతరులు రేకులు అడ్డంపెట్టి మట్టి పోసి భూమి పట్టా మాదే అంటూ మట్టి పోశారు.
ఈ నల్లకుంట పై విజయక్రాంతిలో పలుమార్లు ప్రచురితం చేసిన విష యం విధితమే. ఈ తరుణంలో ఆ పట్టదారులు సైతం కూడా నల్లకుంట పరిధిలోని భూమి మాది... మాకు తెలియకుండా సర్వే చేశారు.. మరోసారి సర్వే చేయాలని కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఏప్రిల్ పరిధిలో ఉన్న ఆ పట్టాదారులకు సంబంధిత రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి ఇటీవల సర్వే చేశారు. సర్వే చేసి నల్లకుంట ఐదు ఎకరాలలో ఉందని, రెండు ఎకరాల ఎఫ్.టి.ఎల్ పరిధిలో రేకులు అడ్డంపెట్టి మట్టి పోశారని అధికారులు గుర్తించారు. ఎఫ్టిఎల్ పరిధికి రేకులు అడ్డంపెట్టడమే ప్రధాన చర్చకు తావిస్తోంది.
- రెండు ఎకరాలు నల్లకుంట ఎఫ్.టి.ఎల్ పరిధిలోనే...
నల్లకుంట ప్రస్తుతం దాదాపుగా 5 ఎకరాల పైగా భూమి ఉందని అధికారులు తేల్చారు. ఈ మేరకు అవసరమైన సర్వేను కూడా పూర్తిస్థాయిలో చేయడం జరిగింది. నల్లకుంటలో రెండు ఎకరాలలో ఎఫ్టిఎల్ పరిధి పట్టాదారులు ఉన్నారని, చెరువులోకి మీరు రానప్పుడు పంట చేసుకునేది అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కాగా ఇక్కడ పంట చేసేందుకు వీలు లేకుండా మట్టితో నింపివేశారు. అవసరం ఉంటే ఇరిగేషన్ అధికారులు తీసుకునేందుకు అవకాశం ఉందని కోర్టు చెప్పినట్లు జడ్చర్ల తాసిల్దార్ తెలియజేశారు. నివేదికను రెవెన్యూ అధికారుల ద్వారా ఇరిగేషన్ శాఖకు పూర్తి రిపోర్ట్ ను అందజేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పై స్థాయి అధికారులకు నివేదికను సమర్పించినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు.
ఎఫ్టిఎల్ పరిధిలో మట్టిని తొలగిస్తారా ? లేదా ?
నల్లకుంట పరిధిలోని ఎఫ్డిఎల్ భాగంలో మట్టిని పోయడంతో ఆ భాగం పై స్థాయిలో కనిపిస్తుంది. దాదాపు రెండు ఎకరాల ఎఫ్టిఎల్ పరిధిలో మట్టిని పోసి భారీ ఎత్తున కాంపౌండ్ వాల్ మాదిరిగా రేకులను అడ్డం పెట్టారు. పట్టాదారుల అడ్డంపెట్టినప్పటికీ ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేయకూడదని అధికారులు చెబుతున్నారు.
అవసరం ఉంటే నల్లకుంటకు ఏ మేరకు అవసరం నిబంధనల మేరకు ఉంటుందో ఆ రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు హక్కులు కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు జడ్చర్ల తాసిల్దార్ తెలిపారు.
ల్యాండ్ అక్విషేన్ చేసి ఏప్రిల్ పరిధిని నల్లకుంట పరిధిలో ఉంచుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు హక్కులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా అసలు ఈ ప్రక్రియ జరుగుతుందా జరగదా అని విషయంలో జడ్చర్ల పట్టణవాసులు సందిగ్ధంలో ఉన్నారు. పట్టణ నడి మధ్యలో ఉన్న నల్లకుంట పట్టణానికి ఆకర్షణీయంగా ఉంటుందని అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి నల్లకుంట యధావిధిగా ఉండేలా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
తదుపరి చర్యలు తీసుకుంటాం
నల్లకుంట భూభాగాన్ని పూర్తిస్థాయి లో రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేయడం జ రిగింది. రెండు ఎ కరాలు ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్నట్లు నివేదిక ను ఉన్నత అధికారులకు అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జరుగుతుంది. పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.
కిరణ్, ఎఈఈ, జడ్చర్ల
నివేదికను ఇరిగేషన్ శాఖ అధికారులకు అందించాం
నల్లకుంట భూభాగాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేయడం జరిగింది. రెండు ఎకరాల భూమి పట్టాదారుడు రేకులు అడ్డంపెట్టిన భూమి ఎఫ్టిఎల్‌లో ఉందని సర్వేలో తేలింది. ఈ నివేదికను ఇరిగేషన్ శాఖ అధికారులకు అందించాం.
ఈ రెండు ఎకరాల భూమికి సంబంధించి కూడా ల్యాండ్ ఆక్వేషన్ ద్వారా ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకునేందుకు కోర్టు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. తదుపరి చర్యలు ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు ముందుకు సాగడం జరుగుతుంది.
నర్సింగ్ రావు, తాహసీల్దార్, జడ్చర్ల