calender_icon.png 6 November, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుడైస్, డీసీఎఫ్ లో పూర్తి వివరాలు నమోదు చేయాలి

06-11-2025 07:00:59 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): UDISE+ DCF 2025–26 ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సయ్యద్ ఆబిద్ అలీ మాట్లాడుతూ పాఠశాలల స్థాయిలో డేటా సేకరణ, ధృవీకరణ, సమయానికి ఆన్‌లైన్ ఎంట్రీ ప్రాముఖ్యతపై వివరించారు. పాఠశాల ప్రొఫైల్, విద్యార్థుల చేరికలు, ఉపాధ్యాయుల వివరాలు, మౌలిక వసతులు తదితర అంశాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ACMO ఉద్దవ్, FAO దేవాజి, APO మల్లేష్, TP రాముతో పాటు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, CRPs, SCRPs పాల్గొన్నారు.