06-11-2025 06:59:11 PM
తలమడుగు (విజయక్రాంతి): తలమడుగు గ్రామంలోని ప్రధాన రహదారి బీటీ రోడ్డుకి ఆనుకొని ఉన్న సీసీ రోడ్డును గ్రామ యువకులు మరమత్తులు చేశారు. రోడ్డు మొదల్లో ఎక్కేటప్పుడు గుంతలుగా మారడంతో అక్కడ వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన స్థానిక బ్లూ బీమ్ యూత్ సభ్యులు వారి సొంత డబ్బులతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో గురువారం ఆ సీసీ రోడ్డు నుంచి బీటీ రోడ్డు వరకు ఆ గుంతలను పూడ్చి ఉదారతను చాటుకున్నారు. యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ప్రేమేందర్, గంగన్న, ప్రశాంత్, సందీప్, రామన్న, అఖిలేష్, జైపాల్ వినయ్, తరుణ్, పారిశుద్ధ్య కార్మికులు గంగన్న, మోహన్, సుధాకర్, భూమన్న, చిన్నన్న, అనిల్ తదితరులు ఉన్నారు