calender_icon.png 16 November, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రానైట్ క్వారీలో కంప్రెషర్ ట్రాక్టర్ బోల్తా

16-11-2025 12:36:09 AM

  1. కార్మికుడి దుర్మరణం 

కేసముద్రం మండలం అర్పణపల్లిలో ఘటన

మహబూబాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ గ్రానైట్ క్వారీలో శనివారం ప్రమాదవశాత్తు కంప్రెషర్ ట్రాక్టర్ ఫల్టీ కొట్టిం ది. ఈ ఘటనలో కంప్రెషర్ ట్రాక్టర్ ఓనర్, డ్రైవ ర్ గుంజ రాములు (53) దుర్మరణం పాలయ్యాడు. యాదగిరి భువనగిరి జిల్లా అడ్డగూడూరు గ్రామానికి చెందిన గుంజ రాములు తన కంప్రెసర్ ట్రాక్టర్ ద్వారా గ్రానై ట్ క్వారీలో పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంఘటన స్థలాన్ని కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ క్రాంతి కిరణ్ సందర్శించారు. రాము లు మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరి యా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిం చి కేసముద్రం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.