calender_icon.png 16 November, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

16-11-2025 12:34:49 AM

  1. భర్త, కుమారుడికి తీవ్ర గాయాలు   

జాతీయ రహదారి 44పై ఘటన  

చేగుంట, నవంబర్ 15(విజయక్రాంతి): చేగుంట జాతీయ రహ దారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, ఆమె భర్త, ఆరేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నా యి. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పాటి చందూ, ఆయన భార్య పాటి లక్ష్మీ, చిన్నారి తనయ్ శనివారం మాసాయిపేట మండలం రామంతాపూర్‌లోని జాన్ స్కూల్‌కు వెళ్లి ఫీజులు చెల్లించుకుని తిరిగి తమ గ్రామానికి వస్తున్నారు.

వెనుక నుంచి వచ్చి న కంటైనర్ లారీ వీరి బైక్‌ను ఢీకొనడంతో లక్ష్మీ అక్కడికక్కడే మృతిచెందగా, చందు, తనయల కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ పైలెట్ భాను సంఘటన స్థలానికి చేరుకుని గాయప డిన వారిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తూప్రాన్ పోలీసులు ఘటన స్థలా నికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.