22-05-2025 01:10:48 AM
విద్యార్థులలో సామర్థ్యాలు పెంపొందించాలి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచాలి
జిల్లా విద్యా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహానంది
గోపాలపేట మే 21: రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ఆధారిత బోధనను ప్రారంభిస్త్నుమని జిల్లా విద్యా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహానంది అన్నారు. బుధవారం గోపాల్ పేట బాయ్స్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న మూడు మండలైనా గోపాల్ పేట, ఎదుల, రేవల్లి మండల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రభుత్వం పాఠశాల లో విద్యార్థులను సంఖ్య పెంచాలని, బోధన లో పద్ధతులను మార్చాలని అపుడే నాణ్యమైన విద్యా ను అందించగలమని అన్నారు. ఈ విద్యా సంవత్సరం లో కేరళ వారి సాఫ్ట్వేర్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన విధానాన్ని, డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన అన్నారు.
ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ తరగతి గదిలో కచ్చితంగా అమలు చేస్తే విద్యార్థులలో మార్పు వచ్చి మన పాఠశాల పై విద్యార్థులకు తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. వచ్చే నెల 6 నుండి ప్రారంభంకానున్న ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట లో ఉపాధ్యాయులు కచ్చితంగా పాల్గొన్ని విద్యార్థుల సంఖ్య ను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గోపాల్ పేట్, ఎదుల మండల విద్యాధికారి ప్రభాకర్, రేవల్లి మండల విద్యాధికారి ఎం బాల్ రెడ్డి, మండల ఆర్ పి లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.