12-11-2025 07:49:06 PM
ఎల్బీనగర్: ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలో చదువుకుంటున్న అనాథ విద్యార్థులకు రూ 1.18 లక్షల విలువైన కంప్యూటర్ సర్వర్లను హైదరాబాద్ లోని ప్రఖ్యాత భద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్ చైర్మన్ శరత్ పిట్టి బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మెంబర్ వినయ్ అగర్వాల్ మాట్లాడుతూ... అనాథ విద్యార్థి గృహం ఒక అద్భుతమైన వసతి గృహామన్నారు. అనాథ పిల్లలను చేరదీసి, వారికి భోజన, వసతి, విద్యా, వైద్యంతో సకల సౌకర్యాలు కల్పించి, వారి భవిష్యత్తుకు నిరంతరంగా కృషి చేస్తున్నారని అభినందించారు. 50 కంప్యూటర్లు ఉన్న ల్యాబ్ లో పదేపదే కంప్యూటర్ సీపీయూలు చెడి పోతున్నాయని, శాశ్వత పరిష్కారం కోసం 50 కంప్యూటర్లు ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేయడానికి సర్వర్ ను విరాళంగా అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్, ట్రస్ట్ మెంబర్ దీపక్ గుప్తా, ట్రస్ట్ అధికారి రత్నం రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.