calender_icon.png 12 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులు

12-11-2025 07:46:16 PM

ఎల్బీనగర్: ఆర్టీసీ సంస్థ ఉన్నతికి ఉత్తమ ప్రతిభా చాటిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులు అందజేశారు. నాగోల్-బండ్లగూడ డిపోలో బుధవారం ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అలార్డులను డిపో మేనేజర్ రమేశ్ బాబు అందజేశారు. అధిక మైలేజ్ సాధించిన డ్రైవర్లు, అధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లు నగదు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ రమేశ్ బాబు మాట్లాడుతూ... ఉత్తమ ఉద్యోగులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రమాదేవి, మెకానిక్ ఇంజినీర్ యోగేశ్వరి, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.