22-06-2025 12:00:00 AM
రెజొనెన్స్ పాఠశాల డైరెక్టర్ శ్రీధర్‌రావు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): ఖమ్మంలోని స్థానిక శ్రీనగర్ కాలనీలోని రెజొనెన్స్ స్కూల్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు పలు రకాల ఆసనాలు వేశారు. పాఠశాల డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. 2016 నుంచి ఏటా యోగా డేను నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని పేర్కొన్నారు.
యోగా ఒక జీవన విధానం అని తెలిపారు. యోగాతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిస్పృహలను దూరం చేయవచ్చాన్నరకు. తమ పాఠశాలలో విద్యార్థులకు యోగా నేర్పేందుకు ప్రత్యేకంగా టీచర్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పాఠశాల డైరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే యోగా, మంచి ఆహారపు అలవాట్లను పాటించటం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పి.వి.ఆర్. మురళీమోహన్, అధ్యాపకుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.