22-06-2025 12:00:00 AM
బాధితులకు రూ.6 లక్షల చెక్కు పంపిణీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): అగ్ని ప్రమాదంలో మరణిం చిన బాధిత కుటుంబ సభ్యులకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును శనివారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు. 16 ఏప్రిల్ 2023న కుషాయిగూడ కట్టెల మండిలో అగ్నిప్రమాదం జరిగి సాయినగర్ కాలనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పక్కనే నివాసం ఉంటున్న రేట్నేని నరేష్, తన భార్య సుమ, కుమారుడు జోషిత్ మరణించిన విషయం విధితమే. బాధిత కుటుం బానికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరైన నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తన పుట్టిన రోజు సందర్భంగా జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యుడు రేట్నేని చెన్నయ్యకు అందజేశారు.