31-07-2025 12:26:39 AM
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
చిలుకూరు, జూలై 30 : తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డ పద్మమ్మ కీలకపాత్ర వహించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ శాసనసభ్యులు, దొడ్డ నరసయ్య, సతీమణి కామ్రేడ్ దొడ్డ పద్మమ్మ, (99),మంగళవారం అనారోగ్య సమస్యలతో మరణించింది. కాగా ఆమె అంత్యక్రియలు బుధవారం చిలుకూరులో నిర్వహించారు.
ఆమె పార్దివదేహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఉజ్జిని యాదగిరిరావు, పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పద్మమ్మ మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటన్నారు.
కాగా పద్మమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా (X) వేదికగా సంతాపం తెలియజేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, ఉజ్జిని రత్నాకర్, బెజవాడ వెంకటేశ్వర్లు, దండి సురేష్, ఉస్తేల సృజన, పశ్యపద్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కళావతి, మండవ వెంకటేశ్వర్లు, ముత్తవరపు పాండురంగారావు, బుర్రి శ్రీరాములు, వెంకటేశ్వరరావు, కస్తూరి నరసయ్య,దొడ్డ సురేష్, పాల్గొన్నారు.