calender_icon.png 11 October, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించండి

11-10-2025 12:20:33 AM

  1. నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో మానవహారం

రాజ్యాంగ మూలాలు కాపాడే బాధ్యత యువతపై ఉంది

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 10 (విజయక్రాంతి) :సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై దాడిని ఖండిస్తూ శుక్రవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం కేంద్రంలో అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.

అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గావాయి అడ్వకేట్ రాజేష్ కిషోర్ వేసిన పిల్ ఫై ప్రసంగిస్తూ కాజురాహు లోని ఆలయ విషయం, భారత పురావస్తు శాఖ (ఆర్కియాజికల్ ) సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుందని సూచించారు.

అందుకు ఆగ్రహించిన మతోన్మాది న్యాయవాది రాజేష్ కిషోర్ సనాతన ధర్మం జోలికి వస్తే ఈ దేశం సహించబోదని నినాదాలు చేస్తూ తన బూటుతో సిజేఐ పై దాడి చేయడానికి ప్రయత్నించగా మార్షల్ అడ్డుకోవడం జరిగిందన్నారు. భారత దేశ న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు.

దళిత జాతికి చెందిన జస్టిస్ గవాయిపై దాడి చేసిన సీనియర్ న్యాయవాది మతోన్మాది రాజేష్ కిషోర్ పై తక్షణమే ఎస్సీ ,ఎస్టీ  అట్రాసిటీ కేసు నమోదు చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి తక్షణమే బహిష్కరించి, నాన్బెయిల్ బుల్ కేస్ పెట్టాలనీ డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయి పే జరిగిన దాడి మాత్రమే కాదని భారత రాజ్యాం గం పై జరిగిన దాడిగా భావించాల్సిన అవసరం ఎ ఉందన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, ఉపేందర్, బపేష్,చం ద్రగిరి ప్రసాద్,రసూల్ పాషా, జావీద్,రణధీర్,కొచ్చెర్ల రాకేష్, ఎస్ కే, నాదీమ్, ఇర్ఫాన్, అజయ్, రవి,చింటూ,నవారాక్, టీంకు, తదితరులుపాల్గొన్నారు.