11-10-2025 12:19:15 AM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని సోమూరు గ్రామంలో సెప్టెంబర్ 28న డబ్బుల విషయంలో గొడవ జరిగింది. భీమ్ రావు కు రాజ్ కుమార్ డబ్బులు బాకీ ఉండగా.. రాజ్ కుమార్ ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో వారందరూ కలిసి రాజ్ కుమార్ ను కట్టెలతో కొట్టారు. దీంతో రాజ్ కుమార్ తరపు బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో గ్రామానికి పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే తీవ్రగాయాల పాలైన రాజ్ కుమార్ ఈ నెల 6న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ పై దాడి చేసిన సూర్యకాంత్, రామన్నాథ్, రాచప్ప, తేజరావు, పండిత్ రావు, హనుమంత్, బీంరావ్ లను హత్యా నేరం కేసుపై అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం వారందరినీ కోర్టులో హాజరు పరిచి రీమాండ్ కి తరలించామని బాన్సువాడ డి.ఎస్.పి విఠల్ రెడ్డి మద్నూర్ పోలీస్ స్టేషన్ లో తెలియజేశారు.