24-08-2025 05:46:29 PM
భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బొర్లం గ్రామంలోని స్వయం భు ఆది బసవేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం సోమలింగ శివాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నదాన కమిటీ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్నదాన వితరణ కార్యక్రమానికి బాన్సువాడ పరిసర ప్రాంత భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయాలని కమిటి నిర్వాహకులు తెలిపారు.