calender_icon.png 5 August, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడిసి భవనం వద్ద బురద మాయం..

24-07-2025 05:14:24 PM

మొరం వెయించి సమస్య పరిష్కారించిన సామాజిక కార్యకర్త..

బోథ్ (విజయక్రాంతి): బోథ్ లోని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ(Village Development Committee) భవనం వద్ద వర్షాకాలం సందర్భంగా చిత్తడిగా మారింది. దీంతో మొరం పోయామని సామాజిక కార్యకర్త చట్ల ఉమేష్ ను వీడిసి సభ్యులు కోరారు. ఈ మేరకు వీడిసి భవనం వద్ద మొరం పోయించారు. ఈ సందర్భంగా కృతజ్ఞతగా సామాజిక కార్యకర్త చట్ల ఉమేష్ ను బోథ్ వీడిసి తరఫున గురువారం ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త చట్ల ఉమేష్ మాట్లాడుతూ, ప్రజలకు ఏ సమస్య ఉన్న నాకు తోచిన సహాయం చేస్తూ ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు అల్లకొండ పోతన్న, కోశాధికారి రాయిపేల్లి రమాకాంత్, ఉపాధ్యక్షులు ఎలుక రాజు, సయ్యద్ యాసిన్, మెడిచేల్మ ప్రవీణ్, తదితర సభ్యులు పాల్గొన్నారు.