31-08-2025 01:13:31 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): స్టార్ లివర్ టాల్క్స్ సదస్సును శనివారం స్టార్ లివర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో, ప్రోగ్రామ్ డైరెక్టర్, చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో హోటల్ వెస్టిన్, మైండ్‌స్పేస్, హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రిపేరింగ్ ద కాంప్లెక్స్ రిసీపెంట్ అనే నినాదంతో నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సుకు (ఆగస్టు 30 తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి 3 సీఎంఈ పాయింట్లు గుర్తింపు లభించింది.
వైద్య జ్ఞానం, వారి అనుభవాలు పంచుకునే అంతర్జాతీయ వేదిక స్టార్ లివర్ టాల్క్స్ ఈ అంతర్జాతీయ సదస్సుల వార్షిక శ్రేణిలో తొలి సమావేశంగా జరిగింది. భారతదేశం, విదేశాల నుంచి ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు హాజరై కాలేయ మార్పిడి వైద్యాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి సదస్సును ప్రారంభించి, ‘లైఫ్ ఆఫ్టర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్: ఏ హ్యాండ్‌బుక్ ఫర్ హెల్దీ లివింగ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కాలేయ వ్యాధితో పాటు మూత్రపిండ సమస్యలు, గుండె సమస్యలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా బలహీనతతో బాధపడుతున్న వారు, స్ట్రక్చర్డ్ సెషన్లు, కేస్ ఆధారిత చర్చల ద్వారా, ఈ క్లిష్ట పరిస్థితులలో బహుళ వైద్య విభాగాల సహకారంతో వ్యక్తుల సంరక్షణ, శస్త్రచికిత్స సురక్షితత, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచే వ్యూహాలు చర్చించారు.
ఈ సందర్భంగా మాయో క్లినిక్, యూఎస్‌ఏ ప్రొఫెసర్ ప్యాట్రిక్ కమాత్ కీనోట్ లెక్చర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సదస్సులో డా. గొపిచంద్ మన్నం, మేనేజింగ్ డైరెక్టర్, స్టార్ హాస్పిటల్స్ గ్రూప్, డా. రమేష్ గుడపాటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, స్టార్ హాస్పిటల్స్ గ్రూప్, డా. రాహుల్ మెడక్కర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టార్ హాస్పిటల్స్ గ్రూప్, డా. కె. రవీంద్రనాథ్, మెంటర్, స్టార్ లివర్ ఇనిస్టిట్యూట్, డా. మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెచ్‌పీబీ సర్జరీ, స్టార్ హాస్పిటల్స్ పాల్గొన్నారు.
డా. మెట్టు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. “లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఇప్పుడు భారతదేశంలో ఒక స్థిరమైన చికిత్సా పద్ధతిగా మారింది. శస్త్రచికిత్సకు ముందు సమస్యలను గుర్తించడం, రిస్క్ అంచనా వేయడం, చికిత్స అవసరమున్నవారిని సరిగా సిద్ధం చేయడం మంచి ఫలితాలకు కీలకం” అని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే కేవలం ప్రాణం కాపాడటం మాత్రమే కాదు, రోగికి కొత్త జీవితాన్ని అందించడం” అన్నారు.