calender_icon.png 1 September, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతికతలపై దృష్టి పెట్టాలి

31-08-2025 01:15:26 AM

వైద్యులకు కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ భాస్కర్‌రావు సూచన

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): అధునాతన సాంకేతికలపై వైద్యులు దృష్టి పెట్టాలని కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కర్‌రావు సూచించారు. శనివారం కిమ్స్ హాస్పిటల్స్‌కి అనుబంధంగా ఉన్న కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో “ట్రాన్స్‌లేషనల్ రీసర్చ్, జనోమిక్స్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్‌” అనే అంశంపై ఒకరోజు సింపోజియం సదస్సు ని కిమ్స్ హాస్పిటల్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పరిశోధనలు నేరుగా ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు. కెఎఫ్ ఆర్ సీ అనేది స్టెమ్ సెల్ ఆధారిత పునరుత్పత్తి వైద్యం, బయోమార్కర్ డిస్కవరీ, లిక్విడ్ బయాప్సీ, మాలిక్యూలర్ జనెటిక్స్, టెలిరేడియాలజీ మరియు న్యూరోబయాలజీ రంగాల్లో విశేష పరిశోధనలు నిర్వహిస్తున్న స్వతంత్ర పరిశోధనా సంస్థ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సయ్యదా నిర్వాహకురాలిగా వ్యవహరించారు. కె ఎఫ్ ఆర్ సీ ఛైర్మన్ డాక్టర్ వి. భుజంగరావు మాట్లాడుతూ.. కెఎఫ్‌ఆర్‌సీ జరిపే పరిశోధనలు గురించి వివరించారు.

ముఖ్యంగా 1000 మందికి పైగా చూపులేని వారి కోసం కె ఎఫ్ ఆర్ సీ తయారు చేసిన తయారు చేసిన స్మార్ట్ దృష్టి కళ్లజోడులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ జిఎన్ రావు మాట్లాడాతూ.. ట్రాన్స్‌లేషనల్ రీసర్చ్ వైద్య రంగానికి ఎంత ముఖ్యమో వివరించారు. కిమ్స్ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్ ఖచ్చితమైన వైద్య పద్ధతుల ప్రాముఖ్యతపై ప్రసంగించారు.

సదస్సులో 100 మంది పాల్గొన్నారు. వైద్యులు, పరిశోధకులు, పీజీ/అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ పరిశోధన ఫలితాలను ఒరల్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్ల ద్వారా ప్రవేశపెట్టారు. కిమ్స్ హాస్పిటల్స్ సీనియర్ వైద్యులు కూడా ప్రస్తుత వైద్య రంగ అభివృద్ధులపై తమ పత్రాలను సమర్పించారు.