15-09-2025 01:44:01 AM
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మోహన్ భగవత్
ఇండోర్, సెప్టెంబర్ 14: ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించినపుడు ప్రపంచ దేశాల్లో దేన్నీ ఆక్రమించలేదని, స్వార్థ ప్రయోజనాల వల్లే ప్రస్తుతం దేశాల నడుమ గొడవలు జరుగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించిన మూడు వేల సంవత్సరాల్లో ఎటువంటి కలహాలు లేవు.
ప్రపంచంలో ఈ కలహాలన్నింటికీ కారణం స్వార్థ ప్రయోజనా లు. అవే అన్ని సమస్యలను సృష్టిస్తున్నాయి. భారత్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ.. కొందరి వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తోంది. బ్రిటీష్ రూల్ అంతమైన తర్వాత కూడా భారత్ ఐకమత్యంగానే ఉంది. తద్వారా ఆనాటి బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అనుమానాలు పటాపంచలు చేసింది’ అని తెలిపారు. భారత్ బ్రిటీష్ వారి నుంచి విడిపోయిన తర్వాత మనుగడ సాధించలేదని.. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో విన్‌స్టన్ చర్చిల్ తెలిపారు. ఆ వ్యాఖ్యలను తప్పని భారతీయులు నిరూపించారని భగవత్ వ్యాఖ్యానించారు.