15-09-2025 12:48:51 AM
-ప్రపంచంలో శాంతి నెలకొనాలి..
-స్వామి అభిషేక్ బ్రహ్మచారి
-మూడోరోజూ శ్రీవిద్యా దాసకోటి కుంకుమార్చన మహాయాగం
అమరావతి, సెప్టెంబర్ 14: భారత్ విశ్వగురువుగా ఎదగాలని స్వామి అభిషేక్ బ్రహ్మచారి ఆకాంక్షించారు. భారత దేశాభివృద్ధి, ప్రపంచ శాంతి, పేదల క్షేమాన్ని కాంక్షిస్తూ స్వామీజీ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గుంటపల్లి రమేష్ నగర్ సీఎ కన్వెన్షన్ సెంటర్‌లో చేపట్టిన శ్రీ విద్యా దాసకోటి కుంకుమార్చన మహాయాగం ఆదివారం మూడోరోజుకు చేరుకున్న ది. ఈమ హాయాగంలో ఇప్పటివరకు 8 వేల మందికి పైగా మహిళా భక్తులు పాల్గొన్నారు. మూడు రోజుల్లో 10 కోట్లసార్లు శ్రీలలితా సహస్ర నామ మంత్రాన్ని పఠించారు.
కుంకుమార్చన చేశారు. మూడో రోజుకు అర్చనలు 30 కోట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి మాట్లాడుతూ.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందాలని లలితా దేవిని ప్రార్థించామని తెలిపారు. సనాతన ధర్మం భారత్‌కు బలమని, ధర్మాన్ని అనుసరించేవారు న్యాయ మార్గంలో పయనిస్తారని పేర్కొన్నారు. యువ చేతన జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. భారత ప్రజల శ్రేయస్సు కోసం తమ సంస్థ అంకితభావంతో పనిచేస్తుందన్నారు.
ధర్మ పరిరక్షణ నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఐకాన్‌గా ఎదుగుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని శివనాథ్, డాక్టర్ అనంత్ లక్ష్మి, శారద, భాను, రాజ్‌మల్ జైన్, రోహిత్ చౌదరి పాల్గొన్నారు.