10-09-2025 06:53:59 PM
జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పదోన్నతి పొందిన సిబ్బంది అటవీ సంరక్షణలో మరింత కార్యోన్ముఖులు కావాలని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్(District Forest Officer Neeraj Kumar) అన్నారు. జోడేఘాట్ రేంజ్ లో ఎఫ్బిఓ గా విధులు నిర్వహించి ఎఫ్ఎస్ఓ గా పదోన్నతి పొందిన స్వప్నకు పదోన్నతి చిహ్నం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా పదోన్నతులలో ఇతర జిల్లాలలో పనిచేస్తున్న ఒక డిఆర్ఓ తో పాటు ముగ్గురు సెక్షన్ అధికారులు జిల్లాకు వచ్చారని జిల్లాలో పనిచేస్తున్న ఒకరికి సెక్షన్ అధికారి పదోన్నతి వచ్చిందన్నారు. విధి నిర్వహణలో పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుందని తెలిపారు. అడవుల సంరక్షణలో మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా పదోన్నతి పొంది జిల్లాలో విధుల్లో చేరిన సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.