10-09-2025 06:51:17 PM
చండూరు (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం అని మడేలయ్య దేవాలయ కమిటీ చైర్మన్ భూతరాజు దశరథ అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నాగిళ్ల శంకర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక చౌరస్తాలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చండూర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్స్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, నలపరాజు సతీష్, ఐతరాజు మల్లేష్, సంగెపు మల్లేష్, బూతురాజు పాండు,శ్రీశైలం నిరంజన్, నరేష్,రమేష్, శేఖర్ కారంగు గిరి తదితరులు పాల్గొన్నారు.