calender_icon.png 10 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల తిప్పలు.. ఆందోళన వద్దంటున్న అధికారులు

10-09-2025 07:01:11 PM

ధర్మపురి (విజయక్రాంతి): సమయానికి యూరియా అందించడములో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెల్గటూర్ పీఎసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం ప్రతిరోజు ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందనీ వెంటనే ప్రభుత్వం యూరియా అందించి రైతాంగాన్ని ఆదుకోవాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యూరియా అందుబాటులోనే ఉంది

వ్యవసాయ మండలాధికారి పెండ్యాల సాయి కిరణ్

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది. కాబట్టి రైతులు అధైర్యపడొద్దు.ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ ఎకరానికి ఒక్కో యూరియా బస్తను అందిస్తున్నాం. ప్రతిరోజు 25టన్నుల వరకు యూరియా మండలానికి వస్తుంది. ఇప్పటికే దాదాపు 750 టన్నుల యూరియాను మండల రైతంగానికి సరఫరా చేసాం. ఇంకో 400 టన్నుల యూరియా అవసరం ఉందనీ పై అధికారులకు నివేదిక పంపడం జరిగింది. ప్రతీరోజు వెల్గటూర్ పీఏసీఎస్ కేంద్రం మరియు రైతు వేదికలో యూరియాను  రైతులకు అందించడం జరుగుతుంది. వరినాటు వేసి చాలా రోజులు అయిందని దిగులుపడే రైతులు నానో యూరియాను యూరియాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చును. దానివల్ల పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదు. రైతులు వ్యవసాయ శాఖకు సహకరించాలనీ విజ్ఞప్తి చేస్తున్నాము.