calender_icon.png 21 May, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు

21-05-2025 12:12:11 AM

కోదాడ మే 20: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో ఈనెల 3,4 తేదీలలో హైదరాబాదులో జరిగిన తెలంగాణ  ఏక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో ఖ్యాతి స్పోరట్స్ అకాడమీలో శిక్షణ పొందిన 12 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో  నిలిచి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన సందర్భంగా సూర్యాపేట జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోచ్ పాలడుగు ఖ్యాతితో కలిసి క్రీడాకారులను ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రముఖ న్యాయవాదులు ఎస్ ఆర్ కె మూర్తి, మేకల వెంకట్రావు, మల్లికార్జున్ రెడ్డి, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ ఓరుగంటి కిట్టు, కోచ్ లు పాలడుగు ఖ్యాతి, శివా పాల్గొన్నారు