21-05-2025 12:06:15 AM
ఈటల విచారణకు హాజరవుతారు..
ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు..
హైదరాబాద్ (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు(MLA Palvai Harish Babu) స్పష్టం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) కమిషన్ విచారణకు హాజరవుతారని తెలిపారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను త్వరగా తేల్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈనెల 22నే కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి వస్తుందంటూ లీకులిచ్చి, ఇప్పుడు గడువును మరో రెండు నెలలు పొడిగించారన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికే ఓ స్పష్టత లేదని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందెవరో త్వరగా తేల్చాలని కోరారు.