21-05-2025 12:37:37 AM
ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ అని ఆయనకు దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా కవిత పోస్టు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదనీ, కాంగ్రెస్ కమీషన్ అని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు అని, తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను తరలించడానికి కట్టిన ప్రాజెక్టు అన్నారు. తాను కలలుగన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం అని చెప్పారు. ఎన్ని కమీషన్లు ఏర్పాటు చేసినా కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయన్నారు.