21-05-2025 12:10:14 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, మే 20 (విజయ క్రాంతి): వచ్చే ఎన్నికల నాటికి ప్రతి కాలనీలో చుక్క నీరు నిల్వకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 58, 61 వ డివిజన్ వడ్డేపల్లి, ప్రశాంత్ నగర్, సిద్ధార్థ నగర్, వెంకటాద్రి నగర్ లలో దాదాపు రూ.3 కోట్లతో ఆయా కాలనీలలో అంతర్గత రోడ్లు నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమంలో జి డబ్ల్యు ఎం సి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే లా తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని కొబ్బరికాయ కొట్టారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా సమవుజ్జిగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో నిర్ణీత సమయంలో రోడ్లు, డ్రైన్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాయి పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమవుజ్జీగా చేస్తున్నామని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో చాలా కాలనీలలో డ్రైన్, సీసీ రోడ్ల అవసరం ఉన్నదని క్రమేపీ మున్సిపల్, ఆర్ అండ్ బి నుంచి నిధులను తీసుకునివస్తు పనులను చేపిస్తున్నమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎండి నేహాల్, 58 వ డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్, మండల సమ్మయ్య, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి విజయ్, తాళ్లపల్లి మేరీ, ఎండి ఆరిఫ్, బుస్స నవీన్ కుమార్, మట్టపల్లి కమల్, ఎండి సాజిద్,అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.