calender_icon.png 8 September, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌ను అభినందిస్తున్నా

07-09-2025 01:21:25 AM

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందిస్తున్నట్టు శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత్‌పై 50 శాతం సుంకాలు వేసిన ట్రంప్, తాజాగా వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీతో తనకు ఎల్లప్పుడూ స్నేహం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఇరు దేశాల సంబంధాలపై ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నా.

భారత్ అమెరికా మంచి భవిష్యత్, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. ట్రంప్‌ను అభినందిస్తున్నట్టు ట్వీట్ చేసిన మోదీ, స్నేహితుడు అని మాత్రం అభివర్ణించలేదు. మోదీ తనకు మిత్రుడే అని కామెంట్ చేసిన ట్రంప్.. ప్రస్తుతం ఆయన చేస్తున్నది నచ్చలేదని పేర్కొన్నారు. రష్యా, భారత్ స్నేహం కోల్పోయాం అని ట్రంప్ శుక్రవారం తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌లో  పోస్ట్ చేశారు. ట్రంప్ నాలుగుసార్లు ఫోన్ చేసినా భారత ప్రధాని మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని జాతీయ మీడియా పేర్కొంది.