07-09-2025 01:14:29 AM
-ఎంత ప్రయత్నించినా రష్యా యుద్ధం మాత్రం ఆపలేకపోయా
-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
-కాంగ్రెస్ సభ్యులకు వైట్ హౌస్‌లో ప్రత్యేక విందు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఏడు నెలల పాలనా కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆపలేకపోయానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాంగ్రెస్ సభ్యులకు వైట్ హౌస్ లో ఇచ్చిన విందులో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గత ఏడు నెలల కాలంలో నేను చేసినంతగా ఎవరూ చేయలేదు. 7 నెలల కంటే కాసింత ఎక్కువ సమయం కావొచ్చు. మేము 7 యు ద్ధాలను ఆపాం.
రష్యా యుద్ధం కూడా చాలా సులభంగా ఆపొచ్చని భావిం చా.. కానీ అది అత్యంత క్లిష్టమైన ఘర్షణ. ర ష్యా అధ్యక్షుడు పుతిన్‌తో స్నేహబంధం వల్ల యుద్ధం ఆపడం తేలికే అనుకున్నా. యుద్ధం ముగించే ప్రయత్నాలు విజయవంతం కాలే దు. యుద్ధం ముగింపు అనేది చివరికి అ త్యంత కష్టతరమైనదిగా మారింది. 31, 35, 37 సంవత్సరాలుగా కొనసాగుతున్న యు ద్ధాలను కూడా ఆపా. వాటిని ఆపడం అసాధ్యమని అంతా భావించారు.
రెండు గంట ల్లో వాటిని ఆపేశా’ అని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా గెలిస్తే కేవలం 24 గంటల్లో రష్యా యుద్ధం ఆపేస్తానని అధ్య క్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చా రు. అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టి ఇ న్ని రోజులవుతున్నా యుద్ధం మాత్రం ఆపలేకపోయారు. యుద్ధం ఆపేందుకు చాలా ప్ర యత్నాలు చేసినా అవి సఫలీకృతం కాలేదు.