01-07-2025 02:11:14 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాం తి): బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల తీరు హాస్యాస్పదంగా ఉన్నదని, ఆ పార్టీలవి డ్రామాలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. పోలవరం బనకచ ర్ల ప్రాజెక్టుకు సంబంధించి, కేంద్ర పర్యావర ణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం నిపుణుల అంచనా కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదకుడికి కొన్ని కీలక సూచనలు చేసిందని సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు అవసరమైన వరదనీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇందుకోసం సీడబ్ల్యూసీతో సంప్రదింపులు జరిపాలని సూచించిందన్నారు. ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధిత అంత:ర్రాష్ర్ట అంశాలపైనా సీడబ్ల్యూసీ పరిశీలన జరిపి, అవసరమైన అనుమతులు పొందిన తరువాతే పర్యావరణ ప్రభావ అధ్యయనానికి నిబంధనల యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను రూపొందించే ప్రతిపాదనను ఈఏసీ ముందు సమర్పించాల్సిందిగా సిఫార్సు చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనన్నారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి విష ప్రచారం చేశాయని మండిపడ్డారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని నిన్నటిదాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కేంద్రం తీసుకున్న నిర్ణ యంతో యూ టర్న్ తీసుకున్నాయన్నారు. కేంద్ర నిర్ణయం తమ విజయంగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు.