calender_icon.png 1 July, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలి

01-07-2025 02:13:39 AM

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాం తి): ఎనిమిదో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షన ర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు పి.నారాయణ రెడ్డి డిమాం డ్ చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సవరణను త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన కేంద్రం, ఆరు నెలలు కావస్తున్నా కమిషన్‌ని ఏర్పాటుచేయలేదని మండిపడ్డారు.

వచ్చే జనవరి ఒకటి నుంచి సవరణ జరగాల్సి ఉండగా ఇప్పటికి కూడా కమిషన్ నియమించలేదన్నారు. వెంటనే వేతన సవరణ కమిష న్‌ను నియామకం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రికి ఈ మెయిల్ క్యాంపెయిన్ చేయాలని సూచించారు. సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, నాగేశ్వర్ రావు, ఎం రంగయ్య, ఆంజనేయులు, డా. ఎల్. అరుణ, ఎం జనార్ధన్ రెడ్డి, స్వరాజ్ కుమార్ భట్, బ్రహ్మచారి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.