06-08-2025 10:14:16 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 100 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోందే తప్ప బీసీల కోసం కాదని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి(BJP District President Nagam Varshit Reddy) బుధవారం ఒక పట్టణంలో మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ మాట తప్పిందని మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ ను అమలు చేయాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్ బీసీలను ఘోరంగా మోసం చేస్తోందని అందుకే కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా, బీసీల హక్కుల కోసం కాదుని ఇది ముస్లింలకు రిజర్వేషన్ల అమలును లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమమే తప్ప, బీసీలపై చిత్తశుద్ధితో పోరాటం కాదని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, ముమ్ముటికీ ముస్లిం డిక్లరేషనే అని దుయ్యబట్టారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే మాత్రమే మేము మద్దతు ఇస్తామన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీని ప్రధాని చేశారా.? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణాలో 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా అని పేర్కొన్నారు.రాష్ట్ర కేబినెట్ లో, నామినేటెడ్ పదవులను ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా అని సవాల్ విసిరారు.లోక్ సభ సభ్యుల్లో ఎంతమంది బీసీలకు సీట్లిచ్చారో కాంగ్రెస్ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుండి కాంగ్రెస్ తప్పించుకోవాలని చూసిందని మండి పడ్డారు. యూపీ, బెంగాల్, బీహార్ తరహాలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్ కు కనుమరుగవడం తథ్యం అని తెలిపారు.