calender_icon.png 7 August, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా

07-08-2025 01:52:24 AM

  1. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు..ఇది ముస్లిం డిక్లరేషనే
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసింది తప్ప బీసీల కోసం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ మాట తప్పిందని ఒక ప్రకటనలో ఆరోపించారు.

మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్‌ను అమలు చేయాలనుకుంటోందని, బీసీలను ఘోరంగా మోసం చేస్తోందని.. అందుకే కాంగ్రెస్ ధర్నా కు బీసీల మద్దతు కరువైందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. తీరా చూస్తే బీసీ బిల్లు పేరుతో అం దులో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలనుకుంటోందన్నారు.

మిగిలిన 32 శాతం రిజర్వేషన్లను మాత్రమే బీసీలకు ఇ వ్వాలనుకుంటోందని... వాస్తవానికి  మోదీ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోం దన్నారు. కాంగ్రెస్ తెచ్చిన బీసీ బిల్లు వల్ల బీసీలకు ఒరిగేది 5 శాతం రిజర్వేషన్లు మాత్రమేనని... బీసీ బిల్లు ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమయ్యరని ఆ రోపించారు.

అసలు ఇది బీసీ డిక్లరేషన్ కానేకాదని... ముమ్మాటికీ ము స్లిం డిక్లరేషన్ మా త్రమేనని విమర్శించారు. రాజ్యాంగం మత పరమైన రిజర్వే షన్లకు విరుద్ధమన్నారు. బీసీలకే పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను అమ లు చేస్తేనే మద్దతిస్తామని స్పష్టం చేశారు.