calender_icon.png 7 August, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ సీఎస్‌కు షోకాజ్ నోటీసులు

07-08-2025 01:54:52 AM

  1. ‘సంధ్య థియేటర్’ ఘటనపై కొరడా

తెలంగాణ సీఎస్‌కు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దుర్ఘటనపై హైదరాబాద్ పోలీసులు సమర్పించిన దర్యాప్తు నివేదికపై జాతీయ మానవ హక్కుల కమిషన్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిం ది. దర్యాప్తు తీరును తప్పుబడుతూ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

పోలీసులు సమర్పించిన నివేదికలో ప్రీమియర్ షోకు పోలీసుల అనుమతి లేదని పేర్కొనడాన్ని మానవ హక్కు ల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ‘అనుమతి లేనప్పు డు నటుడు, అభిమానులు అంత పెద్దసంఖ్యలో థియేటర్ వద్దకు ఎందుకు వచ్చారు? అనుమతి లేని కార్యక్ర మానికి పోలీసులు ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఈ తొక్కిసలాట జ రిగేది కాదు కదా?’ అని కమిషన్ ప్రశ్నించింది.

పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. బాధిత కుటుంబానికి పరిహారం అందించేలా ప్ర భుత్వాన్ని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని నోటీసులో ప్రశ్నించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి కనీసం రూ.5 లక్షల పరిహా రం చె ల్లించేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదు? అని పే ర్కొంది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో, నిష్పక్షపాతంగా మరోసారి దర్యాప్తు చేసి,

ఆరు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.౦దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (35), తన 9 ఏళ్ల కుమారుడు శ్రీ తేజ్‌కు అల్లు అర్జున్ అంటే అమితమైన అభిమానం. అయితే, సినిమా ప్రదర్శనకు ము ందు హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో అభిమానులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చారు.

ఈ క్ర మంలో జరిగిన తొక్కిసలాటలో కిందపడిపోయిన రేవతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. మానవ హక్కుల కమిషన్ తాజా నోటీసులతో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.