09-09-2025 12:35:05 AM
పోడు వ్యవసాయం గిరిజనుల హక్కు..మళ్ళీ దుంపలు తినే స్థితికి తీసుకురా కండి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
బికెఎంయు, సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి విజయవంతం
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 8, (విజయక్రాంతి) : అనాదిగా పోడు సాగుచేసు కొని బుక్కెడన్నం తింటున్న గిరిజన, గిరిజనేతర పోడు సాగుదారులపై అటవీ శాఖ అ ధికారులు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలకు స్వస్తి చెప్పి, పెదాలు స్వేచ్ఛగా సాగు చేసుకొనే వెసులుబాటు కల్పించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కోరారు.
వ్యవసాయ కార్మికు ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వలస ఆదివాసీలకు కులధృవీకరణ పాత్ర లు అందించాలని డిమాండ్ చేస్తూ బికెఎం యు రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, భారత క మ్యూనిస్టు పార్టీ భద్రాద్రి జిల్లా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సాబీర్ పాషా పోడు సాగుదారులు, వ్యవసా య కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఏ జెన్సీ ప్రాంతంలో పేదలు పోడుసాగు చేసుకొని పట్టెడు మెతుకులు తింటున్నారని, వీరి భూములు లాక్కొని మల్లి అడవిలో దుంప లు తినే స్థితికి తీసుకురావద్దన్నారు. అనాది గా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో కందకాలు తవ్వి, సాగులో ఉన్న పంటలను ద్వంసం చేస్తూ, మొక్కలు నాటి బలవంతం గా భూములు లాక్కునే చర్యలు పెదాలపై పాలకులు యుద్ధం ప్రకటించినట్లుగా స్పష్టమవుతోందని,
ఈ చర్యలు మానుకోవాల న్నారు. పోడు వ్యవసాయం గిరిజనుల హ క్కని, ఈ హక్కును లాక్కునే చర్యలు మానుకొని అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్ర భుత్వం ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు అం దుకున్న పోడురైతుల భూములను సైతం లాక్కుంటూ అమాయక గిరిజనులను భయబ్రాంతులకు గిరి చేస్తున్నారని, ఈ విధానం సరైందికాదన్నారు.
ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి రోజుకు రూ.700ల కూలి చెల్లించాలని, సమగ్ర కేంద్ర వ్యవసాయ కార్మిక చట్టాన్ని ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చే యాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఇండ్లు లేని పెదాలకు పక్కా గృహాలు మంజూరు చేయాలనే కార్మికుల డిమాండ్ న్యాయమైదని తక్ష ణమే వాటి అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని డిమాండ్ చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి దశాబ్దాలక్రితం ఈ జి ల్లాకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆదివాసీలకు ఎస్టీ ధ్రువపత్రాలు మం జూరి చేసి, సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. అనంతరం సమస్యల వినతి పత్రా న్ని అధికారులకు అందించారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, రేసు ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సభ, ధర్నా కార్యక్రమంలో నాయకులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసాద్, ఎస్ డి సలీం, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బం ధం నాగయ్య, ఎండి యూసుఫ్, పేరాల శ్రీ నివాస్, అనంతనేని సురేష్, జి రామకృష్ణ, సాప్క నాగేశ్వరరావు, సుంకిపాక ధర్మ, విజ య్, కొమరం హన్మంతరావు, బొర్రా కేశవరావు తదితరులు పాల్గొన్నారు.