calender_icon.png 10 September, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

09-09-2025 07:11:21 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని న్యాయస్థానం ఆవరణలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మేడ్చల్ కోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ అయిన న్యాయవాది సురేష్ పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. దాడికి గురైన న్యాయవాదికి సంఘీభావం తెలియజేశారు. న్యాయవాది రక్షణ చట్టం కోసం డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నినదించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, జనరల్ సెక్రటరీ ఎస్ ప్రదీప్ కుమార్, ఏజిపి సత్యం, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, గడిగొప్పుల కిరణ్ కుమార్, గాండ్ల సత్యనారాయణ, జి పద్మ, పాల్సన్, రెడ్డి మల్ల ప్రకాశం, మల్లికార్జున్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.