calender_icon.png 10 September, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ యాసకు, భాషకు జీవం పోసిన కాళోజీ

09-09-2025 07:07:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత యాసకు, భాషకు ప్రజాకవి, స్వతంత్ర సమరయోధుడు కాళోజి నారాయణరావు జీవం పోశారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ముడారపు పరమేశ్వర్(Mudarapu Parameshwar) అన్నారు. కాళోజి జయంతి సందర్భంగా మంగళవారం సోమవారిపెట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాళోజీ చేసిన రచనలు ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నడిపిన ప్రజావాణి కాళోజీ అని కొనియాడారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి తన రచనలతో కాళోజీ గళమెత్తరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు