calender_icon.png 10 September, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లిన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు

09-09-2025 06:57:21 PM

మత్స్య శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కు అందజేసిన ఉత్తర్వులు

కామారెడ్డి (విజయక్రాంతి): మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో ట్రిబ్యునల్కు వెళ్లారు, అతనికి అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో మంగళవారం రాష్ట్ర మత్స్యశాఖ మేనేజింగ్ డైరెక్టర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఎంతమంది రాజకీయ కక్షతో తన సభ్యత్వాన్ని రద్దు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ లింగంపేట మండలం మోతే గ్రామ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా పోటీ నుండి ఉత్తర్వుల పత్రాన్ని పొందినట్లు తెలిపారు. పారిశ్రామిక సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు కొలుపుల మహేందర్, ఉపాధ్యక్షులు పాక నారాయణ, కార్యదర్శిగా కోరుపుల సురేష్, మోతే గ్రామ డైరెక్టర్స్ బాలరాజు, రవి, చిన్నరాజులు, సుధాకర్, బాలయ్య, సాయిలు, ప్రవీణ్ పాల్గొన్నారు. 

కామారెడ్డి జిల్లా మత్స్య  పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా గాదం సత్యనారాయణ, ట్రీబీనల్ కోర్టు జారీ ఉత్తర్వులు పత్రాన్ని అందజేసిన మేనేజింగ్ డైరెక్టర్ డోలి సింగ్. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గాదం సత్యనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన నేను నా యొక్క ప్రాథమిక సభ్యత్వంను  రాజకీయ కక్షపూరితంగా రద్దు చేయడం జరిగిందని, దానిపైన నేను ట్రీబినల్ కోర్టును ఆశ్రయించడం జరిగిందని, ట్రిబినల్ కోర్టు నా యొక్క సభ్యత్వంను అమలు చేస్తూ మోతే గ్రామ అధ్యక్షుడిగా , జిల్లా అధ్యక్షులుగా కోర్టు నుండి జారి ఉత్తర్వుల పత్రాన్ని మత్స్య పారిశ్రామిక సహకార అధికారి మేనేజింగ్ డైరెక్టర్ డోలిసింగ్ చేతుల మీదుగా పత్రాన్ని అందజేయడం జరిగిందని,మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందే  విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మత్స్యపాల్సిన సహకార సంఘం అధ్యక్షులు కొరుపల మహేందర్, ఉపాధ్యక్షులు పాక నారాయణ, కార్యదర్శి కొరుపల సురేష్, మోతె గ్రామ డైరెక్టర్స్ బాలరాజు, రవి, చిన్న రాజులు, సుధాకర్, బాలయ్య, సభ్యులు సాయిలు, ప్రవీణ్ పాల్గొన్నారు.